వీరబల్లి మండలంలోని పట్టభద్రులందరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా తెదేపా కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా నేత చమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. వీరబల్లి, ఈడిగపల్లి గ్రామాల్లో శనివారం కార్యకర్త లను కలిసి ఓటు హక్కు దరఖాస్తు పత్రాలను అందజేశారు. రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల అభ్యర్థిని పులి వెందులకు చెందిన రాంభూపాల్రెడ్డిని పార్టీ ఖరారు చేసిందని, ఆయనకు అందరూ మద్దతు తెలిపాలన్నారు.
ముందస్తుగా అర్హత ఉన్న పట్టభద్రుకు ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని ధర్మకర్త రామకృష్ణంరాజుకు హామీ ఇచ్చారు. తెదేపా మండల పార్టీ అధ్యక్షుడు భానుగోపాల్రాజు, ఉపాధ్యక్షుడు దుర్గం ఆంజనేయులు, నాయకులు అమరేశ్వరరాజు, తుమ్మల రమేష్, ఆంజనేయులు రెడ్డి, సురేంద్రారెడ్డి పాల్గొన్నారు.