సుండుపల్లి మండలంలోని శాశ్వత సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి కృషి చేయాలని సీపీఐ నాయకులు కోరారు. సుండుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు విశ్వనాథనాయక్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అర్ధంతరంగా ఆగిన రోళ్లమడుగు మంచినీటి పథకం పూర్తికి చర్యలు తీసుకోవాలని, వై. ఆదినారాయణరెడ్డి పింఛ జలాశయం సామర్థ్యం పెంచుతామని ప్రకటించినా కనీసం తెగిపోయిన జలాశయ పునరుద్ధరణ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఝరికోన జలాశయం నుంచి పంట కాలువల నిర్మాణం చేపట్టాలన్నారు. నాయకులు నాగేంద్రనాయక్, అఫ్రిది, సాయినాయక్, గణేష్ పాల్గొన్నారు.