చిన్నమండెం మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత (30) తన ముగ్గురి పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు ఎస్ఐ రామాంజినేయుడు శనివారం తెలిపారు. ఈమెకు 12 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. ఈమెకు ముగ్గురు పిల్లలున్నారు. సెప్టెంబరు 25న రాత్రి వేళ ముగ్గురు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిందని, ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్. ఐ పేర్కొన్నారు.