జగనన్న పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే గడి కోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం లక్కిరెడ్డిపల్లి మండలంలోని దిన్నెపాడు పంచాయతీలో వైకాపా కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఒక్క జగనన్నతోనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం దిన్నె పాడు పంచాతీలో ఏర్పాటు చేసిన దుర్గమ్మకు పూజలు చేశారు. ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ వలి, సోలరాజు ధర్మరాజు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.