బడుగు బలహీన వర్గాల అభ్యుదయ రథసారథి బిసి రిజర్వేషన్ల పితామహుడు బి పి మండల్ విగ్రహ ఏర్పాటుకు సిద్ధం చేసిన దిమ్మెను గుంటూరు నగరపాలక సిబ్బంది కూల్చడం దారుణమైన చర్య అని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి భారతాల శ్రీధర్ బాబు యాదవ్ అన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరులో శనివారం ఆయన మాట్లాడుతూ పౌర హక్కుల కమిషన్ చైర్మన్ గా, ప్రభుత్వ విద్యాసంస్థలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు అండగా బి పి మండల్ నిలిచారని అన్నారు.