మహాత్మా గాంధీ అంటే అహింసా మార్గాన్ని అనుసరించి దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడిగా మనందరికీ తెలుసు. ఆయన సహనం, సత్యం అనే మార్గాన్ని అనుసరిస్తే కష్టతరమైన పోరాటాల్లో విజయం సాధించవచ్చని నిరూపించిన వ్యక్తిగాను సుపరిచితమే. అక్టోబరు 2, 1986న జన్మించిన మహాత్మా గాంధీ ఆలోచనలు ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలోనే కాదు.. ఆయన మాటలు విదేశాల్లోని ప్రజలపై ప్రభావం చూపించాయి. మహాత్మా గాంధీ ఆలోచనలు జీవితానికి కొత్త కోణాన్ని అందిస్తాయి. ఆయన ఆలోచనలు ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతాయి. మహాత్మా గాంధీ త్యాగం, సంయమనం, సరళతకు ఉదాహరణ. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి.
మహాత్మా గాంధీ అందించిన కొన్ని జీవిత సూత్రాలివే:
* మనం ఎవరిని ఆరాధిస్తామో వారిలా అవుతాము.
* తప్పులు చేసే స్వేచ్చ లేని చోట ఆ స్వేచ్ఛకు విలువ ఉండదు.
* పాపాన్ని ద్వేషించండి, పాపిని ప్రేమించండి.
* మీరు ప్రపంచంలో ఏ మార్పును చూడాలనుకుంటున్నారు. అది మీతోనే ప్రారంభించండి.
* తెలిసో,తెలియకో తప్పు చేస్తే దానిని దాచుకునే ప్రయత్నం చెయ్యకూడదు.అంతకంటే పెద్ద పాపం అవుతుంది.
* నా మతం సత్యం, అహింసపై ఆధారపడింది. సత్యమే నా దేవుడు, దానిని సాధించడానికి అహింసయే సాధనం.