దసరా పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదగా రెండు ప్రత్యేక రైళ్లని నడుపుతున్నట్లు డివిజనల్ రైల్వే అధికారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రైలు నెంబర్(07153) నర్సాపూర్- యశ్వంత్ పూర్ 3వ తేదీన రైలు నెంబర్ (07154) యశ్వంత్ పూర్ - నర్సాపూర్ రైళ్ళని గుంటూరు, నరసరావుపేట మీదగా నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa