చాలా మంది వెన్నునొప్పి, మడమ నొప్పి, కాళ్లు, కీళ్ల నొప్పులు, పంటి నొప్పితో బాధపడుతూ ఉంటారు. నొప్పి తగ్గడానికి వారు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అయితే వాటికంటే సహజ సిద్ధమైన నొప్పి నివారణలను వాడటం ఎంతో ఉత్తమం. అల్లం, పసుపు కీళ్ల కండరాల నొప్పులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అల్లం టీ, పసుపు పాలు తాగడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఇంట్లో దొరికే ఈ సహజ పదార్థాలతో నొప్పుల నుంచి బయటపడొచ్చు.