విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన జలుమూరు మండలం పాగోడులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శిమ్మ బోడెమ్మ (55) పొలం పనులకు వెళ్లి చీకటి పడ్డాక ఇంటికి చేరుకుంది. అనంతరం వంట గదిని శుభ్రం చేస్తున్న సమయంలో విద్యుత్తు తీగ తెగి ఆమెపై పడింది. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈమెకు భర్త, పిల్లలు ఉన్నారు. భర్త చిన్నారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ కె. రాజశేఖర్ తెలిపారు. అందరితోనూ కలివిడిగా ఉండే బోడెమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.