15 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడితే వినికిడి, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. చెవులు ఒక స్థాయి వరకు మాత్రమే శబ్ధాన్ని వినగలవని, ఆ స్థాయి శబ్ధం దాటి ఎక్కువ సమయం విన్నా చెవి నరాలు ఇబ్బందికి గురవుతాయని అంటున్నారు. అలాగే, ఒకరి ఇయర్ ఫోన్స్ మరొకరు వాడటం కూడా మంచిది కాదని, ఎందుకంటే ఒకరి చెవిలోని ఇన్‌ఫెక్షన్ మరొకరి చెవికి సోకే అవకాశం ఉందన్నారు.