గుంటూరు: అనుమానాస్పద స్థితిలో చిన్నారి మృతి చెందిన ఘటన గణపవరంలో చోటుచేసుకుంది. ప్రసాద్ కు, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువుకు చెందిన ధనలక్ష్మి తో వివాహమైంది. వీరిద్దరికి నవ్య శ్రీ అనే చిన్నారి ఉంది. మనస్పర్ధల కారణంగా ధనలక్ష్మి మరో వ్యక్తితో సహజీవనం చేస్తూ వేలూరు డొంకలో నివాసం ఉంటుంది. అయితే నవ్య శ్రీ శుక్రవారం రాత్రి మృతిచెందగా. ధనలక్ష్మి ఆమె ప్రియుడు తన కుమార్తెను చంపారని ప్రసాద్ ఫిర్యాదు చేశారు.