మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం మంగళగిరి నగరంలోని గాలిగోపురం వద్ద, కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న మహాత్ముని విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ హనుమంతరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తోలుత భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ 200 సంవత్సరాల పైబడి భారతదేశం పరాయ పాలనలో ఉన్నప్పుడు గాంధీజీ అహింసా మార్గాన్ని ఎంచుకొని దేశానికే కాకుండా విదేశాలకు సైతం మార్గదర్శింగా నిలిచారని కొనియాడారు. ఆ మహాత్ముడు పయనించిన మార్గంలో ప్రతి ఒక్కరు నడుస్తూ చరిత్ర సంస్కృతిని కాపాడాలని సూచించారు.
అలానే భారతదేశ మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి అత్యంత నీతిపరుడుగా చరిత్రలో నిలిచారని, త్వరలో ఆయన విగ్రహాన్ని మంగళగిరి పట్టణంలో ఆవిష్కరిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.