ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియా జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. 18 ఏళ్ల దళిత యువతిని నిందితుడు రాహుల్ రాజ్‌భర్ (22) చెరకు తోటలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి వేధింపులకు పాల్పడ్డాడు. చివరికి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు.