అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నమూష్ట్రరు వద్ద టెంకాయల లోడుతో వెళుతున్న ఐచర్ వాహనం అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. తృటిలో ప్రమాదం తప్పింది. నార్పలకు చెందిన ఐచర్ వాహనం టెంకాయల లోడ్ తో అనంతపురం - బళ్లారి 42వ జాతీయ రహదారిపై ఉరవకొండ వైపునకు వస్తున్న సమయంలో రోడ్డు పక్కన గల ఇంట్లోకి దూసుకెళ్లింది. ఐచర్ వాహనం బాత్ రూమ్ మొత్తం ధ్వంసం కాగా పెద్ద శబ్ధానికి ప్రాణాలు అరచేతి పట్టుకొని బయటకు పరుగులు తీశారు. రాతితో నిర్మించిన బాత్ రూమ్ ధ్వంసం అయింది.