భారత్ లో కొత్తగా 3,011 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న దేశవ్యాప్తంగా 1,34,849 కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో 36,126 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,28,701 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు 218.77 కోట్ల కరోనా టీకాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 4.40 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని చెప్పవచ్చు.