పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం ఇడుపులపాయ ఐటిఐ కళాశాలలో పదవ తరగతి ఫెయిల్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ ప్రసాద్ రావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విద్య సంవత్సరంలో పదో తరగతి పాస్ లేదా 10వ తరగతి ఫెయిల్ అయిన వారు వెల్డర్, ప్లంబర్ కోర్సులలో చేరేందుకు అవకాశం ఉందని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.