అచ్యుతాపురం: మండలం లోని తిమ్మరాజుపేటలో జగ్గారావు మిత్ర మండ లి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సామూహిక షష్టిపూర్తి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు. ఈ మండలి ప్రతినిధుల ఆధ్వర్యంలో శరన్న వరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా నలుమూలల నుంచి 60 ఏళ్లు నిండిన అరవై మంది దంపతు లకు షష్టిపూర్తిని జరిపి, దుశ్శాలువలతో సత్కరించారు. పెద్ద సంఖ్యలో పరిసర గ్రామాల ప్రజలు వీరి ఆశీర్వాదాన్ని అందుకున్నారు. అం తకు ముందు దుర్గామాతకు విశేషపూజలు నిర్వ హించారు. జగ్గారావు మిత్రమండలి సభ్యులు, పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.