తిరుమలలో ఓ వ్యక్తి మెట్ల మార్గంలో తన భార్యను ఎత్తుకొని తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన వరదా వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు), లావణ్య దంపతులు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుపతి వెళ్లారు. దర్శనం కోసం కాలినడకన మెట్ల మార్గంలో నడుస్తూ వెళ్తుండగా, భార్య లావణ్య తనను ఎత్తుకుని మెట్లు ఎక్కాలంటూ తన భర్తకు సరదాగా సవాల్ చేసింది. దీంతో సత్తిబాబు తన భార్యను భుజాలపైకి ఎక్కించుకుని 70 మెట్లు ఎక్కాడు. వీరిద్దరికీ 1998లో వివాహం జరిగింది. తమ ఇద్దరమ్మాయిలకూ పెళ్లిళ్లు కూడా చేశారు.