ఏపీలోని విశాఖకు చెందిన జ్యోతి గుజరాత్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో సత్తా చాటింది. 100 మీటర్ల పరుగును 11.51 సెకన్లలో అధిగమించి గోల్డ్ మెడల్ సాధించింది. కైలాసపురంలో ఉంటున్న జ్యోతిది సాధారణ కుటుంబం. ఆమె తండ్రి సూర్యనారాయణ ప్రైవేటు సెక్యూరిటీగార్డు, తల్లి కుమారి గృహిణి. జ్యోతి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు విజయాలనందుకుంటోంది. దేశంలోనే వేగవంతమైన హార్డ్లెర్‌గా గుర్తింపు పొందుతోంది.