గుజరాత్ లో ఒక యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో ఆదివారం జరిగింది. తారాపూర్‌లోని శివశక్తి సొసైటీ లో గర్బా సెషన్ ను నిర్వహించారు. అక్కడ డ్యాన్స్ చేస్తుండగా వీరేంద్ర సింగ్ రమేష్ భాయ్ రాజ్‌పుత్(21) స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటన మొత్తాన్ని అతని స్నేహితుడు వీడియోలో తీశాడు. వీరేంద్ర గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వీరేంద్ర తండ్రి గుజరాత్‌లోని మోరాజ్ గ్రామంలోని పాఠశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నారు.