ఏపీలో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 4, 5 తేదీల్లో కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయని, ఈశాన్య బంగాళాఖాతంలోని ఆవర్తనం నేడు పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని ఆవర్తనంలో విలీనమవుతుందని తెలిపింది.