ఓ మహిళా ప్రభుత్వాధికారి వ్యక్తిగత సమాచారాన్ని అడిగినందుకు ఆర్టీఐ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలో శనివారం జరిగింది. ముళబాగిలు తహశీల్దార్ గా పనిచేస్తున్న మహిళ ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంది, విడాకులు ఎందుకు తీసుకుందనే సమాచారం కోరుతూ నాగరాజ్ అనే వ్యక్తి ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళా అధికారి ఫిర్యాదు మేరకు నాగరాజ్ ను అరెస్టు చేశారు.