తనపై ఫేక్ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి, టిడిపి నేత కాలవ శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాయదుర్గం పట్టణ పోలీసు స్టేషన్ కు చేరుకుని ఆయనే స్వయంగా సిఐ శ్రీనివాసులుకు పిర్యాదు చేశారు. సచివాలయ వ్యవస్థను టిడిపి అధికారంలోకి వచ్చాక రద్దు చేస్తామని తాను చెప్పినట్లుగా ఎమ్మెల్యే అఫీసియల్ ఫేస్ బుక్లో ఫోస్టు చేశారని పిర్యాదులో పేర్కొన్నారు