కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గలో జరిగిన డాగ్ షోలో సతీష్ అనే వ్యక్తికి చెందిన 'భీమా' అనే పెంపుడు శునకం హైలైట్ గా నిలిచింది. ఈ శునకం ధర రూ.10 కోట్లు. 'టిబెటన్ మస్తఫ్' జాతికి చెందిన ఈ శునకాన్ని చైనా నుంచి తీసుకొచ్చారు. దీనిని రోజంతా ఏసీలోనే ఉంచుతామని, శునకం కోసం నెలకు రూ.25 వేలు ఖర్చవుతోందని సతీష్ తెలిపారు. దీని బరువు 100 కేజీల కంటే ఎక్కువేనని, రోజుకు ఒక కి.మీ దూరం మాత్రమే నడుస్తుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa