గుంటూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పొన్నూరు కు చెందిన శ్రీను రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడని సమాచారం అందడంతో అధికారులు బొంతపాడు వద్ద దాడి చేసి లారీని సీజ్ చేశారు. 9 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నల్లపాడు పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa