గత 6 నెలల కాలంలో పల్నాడు జిల్లాలో జరిగిన వరుస ద్విచక్రవాహనాల దొంగతనాల కేసులను సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఛేదించారు. సుమారు రూ 23.50 లక్షల విలువైన 55 ద్విచక్ర వాహనాల రికవరీ చేసి,ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసారు. ముద్దాయిలు ముగ్గురూ స్నేహితులు, వ్యవసాయ కూలీలు మరియు ఒకే గ్రామానికి చెందిన వారు కావటం గమనార్హం.
సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని,ఈ దొంగతనాల కేసుల వివరాలను వెల్లడించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్. జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడటం చట్టవిరుద్దం.అది శిక్షార్హం.తప్పుచేసిన వారు పోలీస్ వారి నుండి తప్పించుకోలేరు.కావున ఎవరు కూడా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడవద్దు అని ఈ సంధర్బంగా తెలియజేసారు.