విజయ దశమి సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి కె. నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్తు, అటవీ భూగర్భ గనుల శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రాష్ట్ర పర్యాటక, యువజన క్రీడా శాఖా మాత్యులు ఆర్. కె. రోజా, జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి, ఎస్. పి. పరమేశ్వర్ రెడ్డి, జేసి డి. కే బాలాజీ, డిఆర్ఓ శ్రీనివాసరావు తిరుపతిలో మంగళవారం విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి యొక్క విజయమే ఈ విజయ దశమి స్పూర్తి అని ప్రజలందరూ సహృద్భావ వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేల ఆ దుర్గా మాత ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపై ఉండాలని అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నామని ఈ సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు.