ఏళ్ల తరబడి పాఠశాల విధులకు గైర్హాజరు అయిన ఉపాద్యాయురాలికి సస్పెండ్ ఉత్తర్వులు మండల విద్యా శాఖాధికారులు జారీ చేయ్యగా పర్యవేక్షణ లోపంతో ఎంఈఓ షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యా శాఖాధికారి రమేష్ తెలిపారు. తమ గ్రామానికి ఉపాద్యాయురాలు ఏళ్ల తరబడి విదులకు రావడం లేదని ఇటీవల జి. మాడుగుల మండలం చిలకలవలస గ్రామస్తులు, విద్యార్థులు తల్లిదండ్రులు, కలక్టర్ కు పిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించి ఈ చర్యలు తీసుకున్నారు.