విశాఖపట్నం: తనకు ఇచ్చిన 41 ఏ నోటీసుపై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఏపి సిఐడి అధికారులకు లేఖ రాశారు. ఈ లేఖను అందజేయడానికి విజయ్ తరుపున న్యాయవాదులు సిఐడి కార్యాలయానికి వెళ్లి నాలుగు గంటల పాటు వేచి ఉన్నారు. లేఖను తీసుకోవడానికి సిఐడి అధికారులు రాకపోవడంతో టపాల్స్ ఇచ్చి బయటకు వచ్చేసారు. తనపై నమోదైన ఎఫ్ఎస్ఐఆర్ క్రిమినల్ కేసుల వివరాలు తెలపాలని విజయ్ ఆ లేఖలో కోరారు.