విశాఖపట్నం: నర్సీపట్నంలో ఆరు నెలల వయసుగల పసిబిడ్డపై హేయమైన చర్యకు పాల్పడిన మానవ మృగం గొంది సాయిరాం కిరణ్ కు విశాఖ ఫోక్సో కోర్టు జడ్జి శ్రీనివాసరావు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, వంద రూపాయల జరిమానా విధించారు. బాధిత పసిబిడ్డకు 50 వేల రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని తీర్పులో జడ్జి పేర్కొన్నారు. సంఘటన జరిగి ఐదు నెలలో తీర్పు రావడంపై అనకాపల్లి ఎస్పి గౌతమిసాలి దర్యాప్తు అధికారిని అభినందించారు.