నర్సీపట్నం డివిజన్ పరిధిలో పట్టబద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆర్టీవో భవాని శంకర్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అర్హులుగా ఆయన పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో అన్ని తహసిల్దార్ల కార్యాలయాల్లో ఓటర్లు నమోదు కోసం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసామన్నారు. ఐదు సంవత్సరాలు డిప్లమో కోర్సు చేసిన వారు కూడా అర్హులుగా ఆయన పేర్కొన్నారు.