బనగానపల్లె మండలంలోని టంగుటూరులో వెలసిన పెద్దమ్మ నిత్యాన్నదాన భవన నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన దివంగత నెమలి వెంకటరెడ్డి, నాగసరస్వతమ్మ దంపతుల కుమారుడు విజయకుమార్‌రెడ్డి, శారద దంపతులు రూ. 50, 112 విరాళం అందజేశారు. ఈ మేరకు గురువారం నిత్యాన్నదాన సంస్థ నిర్వాహకుడు రామగంగిరెడ్డికి దాతలు నగదు ఇచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం దాతను సన్మానించి అమ్మవారి తీర్ధప్రసాదాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa