పెద్దకడబూరు: మండలంలోని హనుమాపురం గ్రామంలో సర్పంచ్ పూజారి ఇందిర ఆధ్వర్యంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ప్రదీప్ రెడ్డి శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. పేదల అభివృద్ధి సీఎం జగన్ తోనే సాధ్యమని తెలిపారు. ఇందులో వైసీపీ నేతలు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, పూజారి ఈరన్న, జాము మూకయ్య, ముక్కరన్న, దస్తగిరి, కోతి పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.