చాగలమర్రి మండలంలోని ఆయా గ్రామాల రైతులకు 25 శాతం సబ్సీడీతో శనగ విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు ఏవో రంగనేతాజీ గురువారం తెలిపారు. చాగలమర్రి ఆర్జేకే కేంద్రంలో ఆయన మాట్లాడుతూ క్వింటా శనగ విత్తనాలు రూ. 6, 450, సబ్సీడీ పోను రైతులు రూ. 4, 842 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. శనగ సాగు చేసే రైతులు ఆయా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి తమ పేర్లు నమోదు. చేయించుకోవాలని సూచించారు. శనగ విత్తనాలు వేసిన వెంటనే రైతులు సాగు చేసిన పంట పొలాల్లో ఈ-క్రాప్ చేయడం జరుగుతుందని అన్నారు. శనగ సాగు చేసిన రైతులకు మాత్రమే విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఈవో మంజుల, వీఏఏలు, వీహెచ్ఎలు పాల్గొన్నారు.