శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ని కృష్ణా, గుంటూరు ఉపాద్యాయ ఎమ్మెల్సీ, ఏపి వైఎస్ఆర్ టి ఎఫ్ రాష్ట్ర అద్యక్షురాలు కల్పలతా రెడ్డి, పశ్చిమ రాయలసీమ ఉపాద్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి యం. వి. రామచంద్రారెడ్డి, అలాగే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి లు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా మార్చి నెలలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియ కీలకమని అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యే విధంగా కృషి చేస్తూ, మన అభ్యర్థుల విజయానికి శక్తి వంఛన లేకుండా కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వై ఎస్ ఆర్ టి ఎఫ్ నాయకులు, పట్టభద్రులు పాల్గొన్నారు.