విశాఖపట్నం: ఆలయానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ఓ మహిళ బంగారు నగలను స్కూటీపై వచ్చిన ఓ యువకుడు తెంచుకొని పరారయ్యాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిర్లాకూడలి ప్రాంతంలో నివాసం ఉంటున్న తెలగని పద్మావతి బుధవారం రాత్రి తన ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి మురళీనగర్ వద్ద రామాలయానికి వెళ్లారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ముగ్గురూ ఇంటికి వెళ్లేందుకు నడిచి వస్తుండగా ఓగుర్తు తెలియని వ్యక్తి స్కూటీపై వేగంగా వచ్చి పద్మావతి మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకొని పరారయ్యాడు. తేరుకొని కేకలు వేసేటప్పటికే ఆ వ్యక్తి పరారయ్యాడు. దీంతో ఆమె కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన వెస్ట్ జోన్ క్రైం సీఐ దుర్గాప్రసాద్, కంచరపాలెం సీఐ కృష్ణారావు సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.