విజయవాడ: నగరంలో బోండా ఉమా తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దసరా శెలవులు సందర్భంగా బాపట్ల బీచ్ స్నానానికి వెళ్లి విజయవాడ సింగ్ నగర్ 6గురు మృతి చెందారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కారణంగానే చనపోయారని చెబుతున్నారు. ప్రభుత్వం నిద్ర పోతుందా. కనీసం సూర్యలంక బీచ్ పర్యాటక ప్రాంతం పెద్ద ఎత్తున్న జనం వస్తారని తెలిసి ఎందుకని భద్రత కల్పించలేదన్నారు. ఈ ఘటన పై జబర్దస్త్ రోజా బాధ్యత తీసుకుంటుందా. పర్యటనలు రంగంలో అభివృద్ధి చేసినట్టు రోజా మాటలు గొప్పగా చెబుతుందని విమర్శలు గుప్పించారు.
ఆ కుటుంబాలను ప్రభుత్వం పరామర్శ కూడా చేయక పోవడం సిగ్గు చేటు అన్నారు ప్రతిపక్షం తరుపున మేము న్యాయం చేయాలనీ మాట్లాడితే మా నాయకులను అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. తుగ్లక్ పాలన ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలన్నారు. మా పార్టీ నాయకుల మీద పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలి ఆ కుటుంబాలకు 10లక్షలు ఇవ్వాలని మా నాయకుడు చీఫ్ సెక్రటరీ కూడా లేఖ రాసారు. రెండు రోజుల్లో వారిని ఆదుకోవాలి లేకపోతే బాధితు కుటుంబాలతో కలిసి ధర్నా చేస్తామని హెచ్చరించారు