కృష్ణా, విజయవాడ: మైలవరం రైతుబజార్ లో ఈఓ ఘరానా మోసం ఈ ప్రాంతంలో కలకలం రేగింది. రైతు బజార్ లో రెండు షాపులు కేటాయించి డిపాజిట్ అని చెప్పి షాపుకు 40వేల రూపాయలు లంచం ఈఓ రవి కుమార్ తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. షాపులు కేటాయించకపోవడంతో జాయింట్ కలెక్టర్ దృష్టికి తమ సమస్యని భాదితులు వారి దృష్టికి తీసుకెళ్లారు. డిపాజిట్ కాదు లంచం అని తెలుసుకుని బాధితుల లబోదిబోమంటున్నారు. విచారణ కోసం రవికుమార్ విధులకు హాజరవ్వకుండా ఉన్నతాదికారులు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈఓగా విధులు చిట్టిబాబు వ్యవహరిస్తున్నారు. తమ రెండుషాపులు ఈఓ ఖాళీ చేయాలని చెప్పడంతో రైతుబజార్ ఆవరణలో అల్లం, వెల్లుల్లి, జ్యూట్ బ్యాగులతోబాధితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా రైతు బజార్ ఆవరణలో ఎండు చేపల స్టాల్స్ ఏర్పాటు చేశారు. కాసుల కక్కుర్తి లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మైలవరం రైతు బజార్ పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించకపోతే అడ్డగోలు దోపిడీకి హద్దే లేదు.