అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో గిల్ మూడు పరుగులు చేశాడు. గిల్ 10 ఇన్నింగ్స్‌ల్లో 500 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉంది. సిద్ధూ 11 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌తో సిద్ధూ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.