ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్తింటి వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 07, 2022, 01:42 PM

చిత్తూరు: అత్తింటి వేధింపులకు మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డ సంఘటన శుక్రవారం ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా, తనకల్లు మండలం, మల్ రెడ్డిగారిపల్లెకు చెందిన సురేష్ కు అన్నమయ్య జిల్లా, గుర్రంకొండకు చెందిన రెడ్డిరాణి20నితో ఏడాది క్రితం పెద్దలు పెళ్ళి చేశారు. అత్తింటివారు వరకట్నం కోసం వేదిస్తుండడంతో రెడ్దిరాణి అలిగి శుక్రవారం పుట్టినింటికి వచ్చేస్తూ మార్గమధ్యంలోని ములకలచెరువుకు వచ్చి పురుగు మందు కొనుక్కొని బస్టాండు వద్దకు వచ్చి తాగి ఆత్మహత్యాయత్నం చేయగా స్టానికులు ఆమెను 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమశికతల అనంతరం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఆస్పత్రి అవుట్ పోస్ట్ పోలీసులు మొలకలచెరువు, తనకల్లు పోలీసులకు సమాచారం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com