తిరుమల శ్రీవారిని సింగపూర్ హోంమంత్రి షణ్ముగం శుక్రవారం వేకువజామున దర్శించుకున్నారు. అంతకుముందు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. తిరుమల చేరుకున్న షణ్ముగంకు టీటీడీ ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది. సింగపూర్ హోంమంత్రి షణ్ముగం వెంట తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. 205 రోజులు పాటు 1600కి. మీలు దూరం. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల్లో. 108 గ్రామ సచివాలయాలు, 2015పల్లెల్లో ఉన్న 1లక్షా 42వేల ఇంటింటికి పర్యటించనున్న నేపథ్యంలో సింగపూర్ హోంమంత్రి షణ్ముగం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజల మన్ననలు పొంది ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.