తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగించిన 50 మందికి రూ. 10 వేల జరిమానా విధిస్తూ తిరుపతి రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోటేశ్వరరావు తిరుమల క్యాంప్ కోర్టులో గురువారం తీర్పు చెప్పారు. తిరుపతిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి రూ. 6210 జరిమానా విధిస్తూ తిరుపతి ప్రత్యేక కోర్టు మెజిస్ట్రేట్ సుబ్బలక్ష్మి గురువారం తీర్పు చెప్పారు.