ఏపీలోని వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల ఉద్యమం, విశాఖ రాజధాని అంశాలపై ఆయన స్పందించారు. సీఎం జగన్ ఆదేశిస్తే రాజీనామా చేసి ఉద్యమంలోకి వెళ్లిపోవాలని ఉందని అన్నారు. అన్యాయాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఎవరూ తగ్గొద్దని స్పష్టం చేశారు. తమ పీక కోసేందుకు అమరావతి రైతులు వస్తున్నారా అంటూ ప్రశ్నించారు.