ప్రో కబడ్డీ లీగ్ సీజన్ - 9 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో 41-27 తేడాతో యు ముంబాపై దబాంగ్ ఢిల్లీ విజయం సాధించింది. రెండవ మ్యాచ్‌లో 34-29 తేడాతో బెంగళూరు బుల్స్ చేతిలో తెలుగు టైటాన్స్ పరాజయం పాలైంది. టచ్ పాయింట్ల కంటే, బోనస్ పాయింట్లపై తెలుగు టైటాన్స్ దృష్టి సారించడంతో కొంత నష్టం జరిగింది. ఇక ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై 32-34 స్కోరు తేడాతో యూపీ యోధాస్ విజయం సాధించింది.