శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలోని జగ్జీవన్ రామ్ కాలనీలో శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పెనుకొండ ఎమ్మేల్యే శంకర్ నారాయణ , స్థానిక సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా కాలనీలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అధికారులు ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.