లింగసముద్రం మండల మొగలిచెర్ల గ్రామంలో కొలువుతీరి ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమము శుక్రవారం జరిగినది. 7 నెలల కాలానికి దత్తాత్రేయ స్వామివారి హుండీ ఆదాయం 15, 08, 428 రూపాయల ఆదాయం భక్తుల నుండి స్వామివారికి లభించింది. గతం కన్నా ఈసారి హుండీ ఆదాయం రూ. 6, 12 493 అదనంగా వచ్చింది. ఈ హుండీలెక్కింపు పర్యవేక్షకులుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కు చెందిన కావలి ఇన్స్పెక్టర్ సుధీర్ వ్యవహరించారు.