రాష్ట్ర అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉదయం పీలేరు నియోజకవర్గంలో పర్యటించారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు మొదట పీలేరు - తిరుపతి రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ అస్పత్రి సీటి స్కానింగ్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు.
అలాగే పీలేరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో పర్యటించి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పనులపై ఆరా అధికారులను నాయకులను తీశారు. పెండింగ్ పరులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా అధికారులతో పాటు నాయకులు కూడా కృత నిశ్చయంతో పనిచేయాలన్నారు. మంత్రి వెంట వైఎస్ఆర్సిపి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.