పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మూడవ శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఒక్కసారిగా రావడంతో ఆలయ ప్రాంగణంలోని భక్తులు కిటకిటలాడారు. అన్ని క్యూ లైన్ లలో భక్తులు నిండిపోవడంతో స్వామివారి దర్శనార్థం సమయపాలన కావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి మరియు ఈవో ప్రతాప్ రానా పర్యవేక్షిస్తున్నారు.