2018 జూన్ లో జరిగిన ఓ కేసుకు సంబందించిన గన్ పౌడర్ ను సీజ్ చేసి నాశనం చేయడం జరిగిందని, ఇందులో కొంత భాగాన్ని ఎప్ సి. ఎల్ కోసం ఉపయోగించిన గన్ పౌడర్ ను జి. డి. నెల్లూరు పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న మర్రి చెట్టు కింది భాగంలో పూడ్చిపెట్ట డం జరిగిందని జిల్లా ఎస్పీ రిసాంత్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్రి చెట్టు దగ్గర చిన్న పాటి పేలుడు సంబవించిందని, ఈ పేలుడులో ప్రజలకు కాని పోలీస్ సిబ్బందికి గాని ఎటువంటి గాయాలు అవ్వలేదన్నారు.