ఏపీలోని కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. కాండ్రేగుల కూరాడ గ్రామంలో దేవకి అనే యువతిని సూర్యనారాయణ అనే వ్యక్తి ప్రేమించాడు. దేవకి నిరాకరించడంతో పగతో రగిలిపోయాడు. దేవకి కరప నుంచి కూరాడకు వెళ్తుండగా సూర్యనారాయణ వెంబడించి కత్తితో దాడి చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు శనివారం చనిపోయింది. పెదపూడి స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.